అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ ఎస్సై ప్రీతిక..!

చెన్నై:
పట్టుదలకు నిలువెత్తు ప్రతిరూపం ఆమె. పోలీసు అధికారి కావాలన్న తన కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో అడ్డంకులు, అవమానాలకు ఎదురు నిలిచింది. న్యాయపోరాటం సైతం చేసి తన లక్ష్యాన్ని చేరుకుని దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె తమిళనాడుకు చెందిన ప్రీతికా యాషిని (25). చెన్నైలోని పోలీసు అకాడెమీలో సంవత్సరం రోజుల కఠోర శిక్షణను పూర్తి చేసుకుని, శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి చేతుల మీదుగా సర్టిఫికెట్‌ అందుకొంది. తను కలలు కన్న విధంగా ఖాకీ యూనిఫాం ధరించి విధులు నిర్వర్తించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం ఆమెకు ధర్మపురి ఎస్సైగా పోస్టింగ్‌ ఇచ్చింది. శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించింది.
ఈ సందర్భంగా ప్రీతిక మాట్లాడుతూ శిక్షణ సమయంలో తనకు తోటి అభ్యర్థుల నుంచి మంచి సహకారం అందిందని తెలిపింది. పోలీసుగా బాధ్యతలు నిర్వర్తించబోతుండడం గర్వంగా ఉందని పేర్కొంది. ప్రీతిక పుట్టుకతో అబ్బాయి. యుక్త వయసు వచ్చే వరకు ప్రదీప్‌ కుమార్‌ అనే పేరుతో సేలంలో పెరిగాడు. 20 ఏళ్ల వయసు వచ్చేసరికి శరీరంలోని మార్పులు, హార్మోన్ల ప్రభావం, తన మానసిక స్థితి తాను అబ్బాయి కాదని చెప్పడంతో లింగమార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధపడ్డాడు. తల్లిదండ్రులను విడిచి చైన్నై వచ్చేసి స్థానిక ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ ఆశ్రయం పొంది... ఆపరేషన్‌ చేయించుకొని అమ్మాయిగా మారి ప్రీతికా యాషినిగా పేరు మార్చుకుంది.
(ఆంధ్రజ్యోతి)

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT