అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

ధ్యాస తప్పిన కలెక్టర్

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి గణతంత్ర వేడుకల సందర్భంగా  అసందర్భ నవ్వులతో నవ్వుల పాలయ్యారు.గణ తంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనం ముగిసాక జిల్లా ప్రగతి నివేదిక ప్రసంగంలో కలెక్టర్ అమ్రపాలి నవ్వులు సందర్శకులను అశ్చర్య పరిచాయి. మధ్యలో అదేపనిగా అకారణంగ నవ్వడం ప్రసంగంలో తడబడటం ఆంగ్లంలో ఇట్స్ ఫన్ని అని వ్యాఖ్యానించడం అధికారులు, అతిథులు, సందర్శకులు చూసి అవాక్కయ్యారు.జిల్లా ఉన్నతాధికారిగా అమ్రపాలి మంచిపేరు తెచ్చుకున్నారు. ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా కనిపించే అధికారి గణ తంత్రదినోత్సవం రోజు నవ్వడం తప్పు కాదు కాని కనీసం ప్రసంగం సందర్భంలో నైనా సీరియస్ మెయింటైన్ చేయక పోవడం పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.అధికారి సరిగా తన పనిపై ధ్యాస పెట్ట లేక పోతున్నారు. ఈ మద్యే ఆమెకు పెండ్లి కుదిరిన వార్త మీడియాలో సెలెబ్రెటీ లెవల్ లో చెక్కర్లు కొట్టింది. పాపం పెండ్లి కుదిరిన సంబరంలో ధ్యాస ఎక్కడో ఉండటం వల్ల ఇబ్బంది పడి ఉంటుంది. అమ్రపాలికి మీడియాలో ఎప్పుడూ ఏ సెలెబ్రెటీలకు తీసిపోని విదంగా ప్రచారం   ఉంటుంది మరి.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT