అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

మధురై ఆలయ పూజారిగా బ్రాహ్మణేతర వ్యక్తి


చెన్నై, జూలై 31: మధురైలోని ఒక అయ్యప్పన్ ఆలయానికి తొలిసారిగా ఒక బ్రాహ్మణేతర వ్యక్తిని అర్చకుడిగా నియమించారు. కులాల అడ్డంకులను అధిగమించి బ్రాహ్మణేతర వ్యక్తిని పూజారిగా నియమించాలని ఎంతోకాలం నుండి ఆశిస్తున్న

డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఆశయం ఈ నియామకంతో నెరవేరినట్టేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. డీఎన్‌ఏ కథనం ప్రకారం... తమిళనాడు ప్రభుత్వం తొలిసారిగా బ్రాహ్మణేతర వ్యక్తిని ఒక హిందూ ఆలయానికి

పూజారిగా నియమించిందని పేర్కొంది. 2006లో అప్పటి సీఎం కరుణానిధి సుశిక్షుతులైన అన్నికులాల వారికి హిందూ ఆలయాల్లో అర్చకులుగా అవకాశం కల్పించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా 2007-08 సంవత్సరంలో

డీఎంకే ప్రభుత్వం జూనియర్ అర్చక సర్ట్ఫికెట్ కోర్సును ప్రవేశపెట్టి ఇందుకు ఆరు కేంద్రాలను ఎంపిక చేసి అందులో శిక్షణ ఇవ్వాలని సూచించింది. అప్పట్లో శిక్షణ పొందినవారిలో అత్యంత వెనుకబడిన తరగతులు (ఎంబీసీ)కు చెందిన వ్యక్తిని ఇపుడు

హిందూ మతం ధార్మిక ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ ఆధీనంలో గల మధురై తళ్లకుళం అయ్యప్పన్ ఆలయ అర్చకుడిగా నియమించారు.

 ఆశాగమస్త్ర నిబంధనల ప్రకారమే


ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారమే మదురైలోని తల్లాకులంలో ఎండోమెండ్స్ ఆధ్వర్వంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఇటీవల బ్రాహ్మణేతర వ్యక్తిని పూజారిగా నియమించారు. ఆయన 2007-08లో డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన అర్చక శిక్షణ

పొందిన 206 మంది బ్రాహ్మణేతరులలో ఒకరు. బ్రాహ్మణేతర అర్చకుడు ఉన్నాడని తెలిస్తే ఆలయానికి వచ్చే భక్తులు తగ్గిపోవచ్చన్న అనుమానాల కారణంగా అన్నాడీఎంకే ప్రభుత్వం ఆయన పేరును మాత్రం బయటపెట్టలేదని తెలుస్తోంది. అయితే

ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే మూడు నెలల క్రితం కొత్త అర్చకుడి నియామకం జరిగినట్టు తోటి అర్చకులు తెలిపారు. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారమే ఆయనను నియమించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

సుప్రీం కోర్టు సమర్థన


సుప్రీం కోర్టు సమర్థన ప్రభుత్వ దేవాలయాల్లో అన్ని కులాల వారిని పూజారులుగా నియమించాలని డీఎంకే గతంలో కూడా చెప్పింది. అంతకుముందు డీఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ దిశగా అడుగు వేసింది. కానీ నాడు సుప్రీం కోర్టు

కొట్టివేసింది. 2006లో మరోసారి డీఎంకే ప్రభుత్వం మరోసారి జారీ చేసిన ఉత్తర్వులను మాత్రం సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ తీర్పుపై కరుణానిధి హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత దాదాపు పుష్కరకాలానికి కరుణానిధి కోరిక నెరవేరి మధురై

ఆలయంలో బ్రాహ్మణేతర పూజారి నియామకం ఇటీవల జరిగింది.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT