అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

మహిళా ఎమ్మెల్యే.. ఆలయంలోకిగంగాజలంతో శుద్ధి చేసిన గ్రామస్థులులక్నో: ఓ మహిళ.. అందులోనూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే.. దేవాలయంలోకి అడుగుపెట్టారని శుద్ధి చేశారు గ్రామస్థులు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఈ ఘటన యూపీలోని హమీర్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక

రాత్ నియోజకవర్గ ఎమ్మెల్యే మనీషా అనురాగి.. ముష్కర ఖుర్ద్ అనే గ్రామానికి వెళ్లారు. స్థానిక పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు పంచారు. కార్యక్రమం అనంతరం ఆమె గ్రామంలో ఉన్న ధూమ్ర రుషి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.

ధూమ్ర రుషి.. మహాభారత కాలానికి చెందినవారు. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించారు. ధూమ్ర రుషి కళ్లెదుట మహిళలు ఉంటే.. ఊరికి అరిష్టమని భావిస్తారు స్థానికులు. ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే.. నాలుగు

దశాబ్దాల పాటు ఆ గ్రామానికి కరువు, కాటకాలు తప్పవని అక్కడి వారు విశ్వసిస్తారు. అయితే తాజాగా ఆలయంలోకి ఎమ్మెల్యే అనురాగి ప్రవేశించారు. దీంతో తమ గ్రామానికి ఏమవుతుందనే భయం వాళ్లను పట్టుకుంది. వెంటనే గ్రామ

పంచాయతీ సమావేశం అయ్యి.. గంగా జలంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. అంతేగాక మహర్షి రూపాన్ని పోలిన విగ్రహాన్ని అలహాబాద్ సంగమ క్షేత్రంలో పవిత్ర స్నానం చేయించి తీసుకొచ్చారు. ఆలయ శుద్ధిపై ఎమ్మెల్యే అనురాగి తీవ్ర ఆగ్రహం

వ్యక్తం చేశారు. మహిళలను, రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారన్నారు ఎమ్మెల్యే.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT