అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

వెళ్ళిరావయ్యా కెసిఆర్ వెళ్ళి రా !

సోషల్ మీడియాలో నిరుద్యోగుల వీడ్కోలు

వెళ్ళిరా కే సి ఆర్  ఉద్యమ నాయకుడు అని అభిమానంతో గెలిపించాం. మా నిరుద్యోగుల కృషిని కనీసం అంటే కనీసం నువ్వు గుర్తించలేదు దొర. నిన్ను గెలిపించినందుకు చెప్పుతో మాకు మేము కొట్టుకొనేలా చేశావు. కనీసం రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉస్మానియా స్నాతకోత్సవంలో మాట్లాడలేని పరిస్థితికి దిగజారిపోయావు. మేము నీకు ఏమి అన్యాయం చేసాం దొర మా నిరుద్యోగులను నీ పరిపాలన కాలంలో ఏడిపించావు. మేము దెబ్బలు తింటే ఈ తెలంగాణ సాకారం అయ్యింది అది ఎలా మరిచిపోయావు దొర. మాకిచ్చిన నోటిఫికేషన్లు లొసుగులు నీకు ముందే తెలుసు దొర, నువ్వు మా అయ్యలకు గొర్లు,మేకలు,  బర్లు, చేపలు ఇచ్చి మా బతుకులను వాటికే పరిమితం చేయాలనుకుంటివి. రైతు బందు డబ్బులు మా నిరుద్యోగ వెతలు తీర్చవు దొర. మా అయ్యలకిచ్చిన నాలుగువేల రూపాయలు నీకు ఓట్లుగా మారతాయని కలలుకనకు మా నిరుద్యోగ బాధలు చూసిన మా అయ్యలు మా మాట కాదని నీకు ఓట్లు వేస్తారా. ఒక్కసారి కిరణ్ కుమార్ రెడ్డి ని గుర్తు చేసుకుంటే ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చాడో చూడు, రాష్ట్రము అగ్ని గుండం అయినా నిరుద్యోగ వర్గాలకు మేలు చేశాడు. కానీ ఆయనకు వ్యతిరేకంగా నీకు అనుకూలంగా పోరాడిన నీ కొడుకుల్లాంటి విద్యార్థులను అన్యాయం చేసితివి. 

ఇక చూసుకో మా దెబ్బ

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT