అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

65 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా...కూటమికి షాక్

హైదరాబాద్: కాంగ్రేస్ పార్టి తొలి విడతగా 65 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం డిల్లీలో సోమవారం అర్ద రాత్రి జాబితా ప్రకటించారు. తొలుత అనుకున్న 74 స్థానాల్లో 9 స్థానాలు నిలిపివేశారు. మరికొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఏకాభిప్రాయం ఉన్న స్థానాలకే తొలి జాబితాలో చోటు ఇచ్చారు. సిట్టింగ్‌ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఈ జాబితాలో చోటు దక్కింది. అయితే, మరికొన్ని ముఖ్యమైన స్థానాలను కూడా  పెండింగ్‌లో పెట్టారు. సనత్‌నగర్‌ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య అభ్యర్థిత్వాలను ఆశించినప్పటికీ ఈ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. మిత్రపక్షాలు కోరుతుండటంతో ఈ స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే మిత్రపక్షాల మధ్య ఇంకా స్పష్టత రాని మేడ్చల్, పటాన్‌చెరు, రాజేంద్రనగర్‌ తదితర స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్న స్థానాలను పెండింగ్‌లో పెట్టారు.  
స్క్రీనింగ్‌ కమిటీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మొత్తం 93 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ కేవలం 65 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిత్రపక్షాల స్థానాలపై స్పష్టత వచ్చిన అనంతరం 28 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించనున్నారు.

కూటమి పార్టీలకు షాక్
తొలి జాబితాతో కాంగ్రెస్‌ అధిష్టానం టీజేఎస్, సీపీఐలకు షాక్‌ ఇచ్చింది. ఆ రెండు పార్టీలు అడుగుతున్న స్థానాల్లోనూ తమ అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించింది. ఆసిఫాబాద్, స్టేషన్‌ ఘన్‌పూర్‌లను టీజేఎస్‌ అడుగుతుండగా.. కొత్తగూడెం స్థానాన్ని సీపీఐ కోరుతోంది. ఈ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఆ రెండు పార్టీలు ఇరకాటంలో పడ్డాయి.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT