అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

కూటమి లెక్క కుదిరింది. 94 ప్లస్ 14 ప్లస్ 8 ప్లస్ 3
కాంగ్రేస్ పార్టీకి 94 సీట్లు తెలుగు దేశం పార్టీకి 14 సీట్లు టిజెఎస్ కు 8 సిపిఐ కు 3 సీట్లు ఇచ్చారు. కాంగ్రేస్ పార్టీకి కెటాయించిన సీట్లలో ఒక సీటును తెలంగాణ ఇంటి పార్టీకి ఇవ్వనున్నారు.


కూటమిలో లెక్కలు కుదిరాయి. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో జాబితా ప్రకటించనున్నారు. డిల్లీలో కాంగ్రేస్ పార్టీ వార్ రూములో అన్ని పార్టీల నేతలతో జరిగిన చర్చలు చివరికి ఒక కొలిక్క రావడంతో సీట్ల పంపకాల లెక్క తేలింది. తెలుగు దేశం పార్టి అధి నేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మకాం వేసి సీట్ల లెక్క తేల్చి వేశారు. తెలంగాణలో టిఆర్ఎస్ ను ఒడించే ఏకైక లక్ష్యంతో బాబు చక్రం తిప్పుతున్నారు. అందుకే తెలుగు దేశం తమకు అవకాశాలు ఉండి గెలిచే స్థానాలనే కోరినట్లు సమాచారం.
 కాంగ్రేస్ పార్టీకి 94 సీట్లు తెలుగు దేశం పార్టీకి 14 సీట్లు టిజెఎస్ కు 8 సిపిఐ కు 3 సీట్లు ఇచ్చారు. కాంగ్రేస్ పార్టీకి కెటాయించిన సీట్లలో ఒక సీటును తెలంగాణ ఇంటి పార్టీకి ఇవ్వనున్నారు.

మరో వైపు కాంగ్రేస్ పార్టీలో అభ్యర్థుల ఖరారు చివరి అంకానికి చేరింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆఖరి నిర్ణయాలన్ని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు జరిగాయని సమాచారం. పార్టీలో 19 నుండి ఇరవై స్థానాలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో సందిగ్దం నెలకొంది. 

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT