అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

అందుకే లగడ పాటి పోలీసులతో జగడానికి దిగాడా ?


హైదరాబాద్ లో ఈ మద్య విధులకు ఆటంకం కలిగించిన లగడ పాటిని పోలీసులు ఎందుకు ఉపేక్షించారు?
అదో బేతాళ క
బెజవాడకు చెందిన లగడ పాటి రాజగోపాల్. ఒకప్పుడు తెలంగాణ విలన్ గా రోల్ ప్లే చేసి ఆఖరికి తెలంగాణ వస్తే సన్యాసం పుచ్చుకుని తుండు కప్పుకున్న వ్యక్తి. అయితే ఆయన పేరుకు మాత్రమే సన్యాసం కాని రాజకీయాలకు దూరంగా మాత్రం లేరు. అటు ఎపి సిఎం చంద్రబాబుకు ఇటు తెలంగాణ సిఎం కెసిఆర్ కు ఆయన కుమారుడు కెటిఆర్ కు ఎంత దగ్గరంటే ఆయనెప్పుడు అడిగితే అప్పుడు అప్పాయింట్ మెంట్లు తధ్యం. ప్రగతి భవన్ గేట్లు ఆయన కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి.  ఇద్దరు సిఎం ల భవిష్యత్ కి సంభందించిన  ఎన్నికల జాతకాలు ఎప్పటి కప్పుడు అందిస్తూ ఏం ఫర్వాలేదని భరోసా ఇస్తుంటాడు.
తెలంగాణ సిఎం కెసిఆర్ ఆయన కుమారుడు కెటిఆర్ అండ చూసుకునే ఈ మద్య రియల్టర్ జిపి రెడ్డి ఇంట్లో పోలీసులను అడ్డగించి అర్ద రాత్రి డ్రామా చేసాడని విమర్శలు వస్తున్నాయి.  రూ.300 కోట్ల విలువైన స్థలానికి సంబంధించి ఫోర్జరీ పత్రాలను తయారు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్టర్‌ జీపీ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు కూడ ఉండడంతో అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్ళిన సందర్భంలో లగడ పాటి అదే జగడ పాటి అక్కడ దూరి పోయి ఎట్లా అరెస్టు చేస్తారంటూ ఊగి పోయారు. అంతే కాదు అక్కడే జిపి రెడ్డి ఇంట్లేనే తిష్ట వేసి కుర్చున్నాడు. దాంతో ఏం చేయాలో తోచక  పోలీసులు వెనక్కి తగ్గారు.

పోని ఇవి వాస్తవాలు కాక పోతే పోలీసులు ఎందుకు లగడ పాటిపై కేసు నమోదు చేయలేక పోయారు ?. విధులకు ఆటంకం కలిగించినందుకు అరెస్టు చేసి ఎందుకు బొక్కలో వేయలేదు?. ఈ ప్రశ్నలకు జవాబులు మాత్రం అడగొద్దు. ఎందుకంటే తెలంగాణ పోలీసులు అంతే మరి. 

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT