అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

పొన్నాలకు అధిష్టానం భరోసా...జనగామ సీటు భద్రం

కాంగ్రేస్ పార్టీలో గమ్మత్తైన రాజకీయాలు జరుగి పోతుంటాయి. కూటమి పొత్తులో  టిపిసిసి మాజి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సీటుకు  ఎసరు వచ్చిందనే వార్తలు ఆయనకు ఆందోళన కలిగించాయి. పొత్తులో భాగంగా కోదండరాం జనగామ నుండి పోటీలోకి దిగుతాడని సీటు ఆయనకు కెటాయించడం దాదాపు ఖరారు అయిందని మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో పొన్నాల లక్ష్మయ్య తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. పార్టీలో క్రియాశీలంగా పని చేసిన తన విషయంలో పార్టి అధిష్టానం ఇట్లా చేయడమేంటని సీనియర్లు అయిన తన సహచరుల ముదు భాద వ్యక్తం చేసినట్లు సమాచారం. దాంతో పార్టీ నేతలు పలువురు  అధిష్టానంతో సంప్రదింపులు జరిపి జనగామ సీటు పొన్నాలకే వదిలిపెట్టేలా ఒప్పించినట్లు సమాచారం. జానారెడ్డి స్వయంగా పొన్నాల లక్ష్మయ్యకు ఈ సమాచారం చేరవేయడంతో పొన్నాల ఊపిరి పీల్చుకున్నాడు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT