అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు : రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌.


 హైదరాబాద్:మీడియాతో ఆయన మాట్లాడుతుా.. మొదటి దశ ఎన్నికల ఘట్టం పూర్తి అయ్యిందన్నారు. నామినేషన్ల సమయం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుందన్నారు. తొలి రోజు 43 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. నామినేషన్లు వేసిన దగ్గర నుంచి అభ్యర్థులు ఖర్చు వివరాలు తెలపాలని సూచించారు. అఫిడవిట్‌లో బ్లాంక్‌ ఉంటే నామినేషన్‌ తిరస్కరించడం ఉండదని పేర్కొన్నారు. ఏదైనా కాలమ్‌ ఫిల్‌ చేయకుంటే ఆర్వో అభ్యర్థికి సూచించాలని తెలిపారు.
13 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు రూ. 77.62 కోట్లు సీజ్‌ చేశామన్నారు. మొత్తం 47,234 కేసులు నమోదయ్యాయని స్పష్టం చేశారు. రూ. 6 కోట్ల విలువైన మద్యం పట్టుకున్నట్లు వెల్లడించారు. సివిజిల్‌ యాప్‌ ద్వారా 2251 ఫిర్యాదులు అందాయన్నారు. 1279 ఫిర్యాదులు పరిష్కారించామని చెప్పారు. ఇప్పటి వరకు 2.76 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారన్నారు. నిబంధనల మేరకే లక్షా 16వేల ఓట్లు తొలగించినట్లు చెప్పారు.

కేసీఆర్‌ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మాత్రమేనని తెలిపారు. కుల సంఘాల సమావేశాలకు మంత్రులు హాజరుకావొద్దని సూచించారు. కుల సంఘాల సమావేశాలకు హాజరైతే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనేనన్నారు. కుల సంఘాల సమావేశాలు నిర్వహించే అభ్యర్థులకు నోటీసులు ఇస్తామన్నారు.
నామినేషన్లను పనిదినాల్లో స్వీకరిస్తామన్నారు. 102 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 35 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసిన అభ్యర్థుల ఖర్చులు ఇప్పటి నుంచి లెక్కలోకి వస్తాయి. స్టార్ క్యాంపెనర్ల పేర్లు 7 రోజుల్లో ఇవ్వాలి. లేదంటే ఖర్చు అంతా అభ్యర్థికి చెందినదిగా పరిగణిస్తాం. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మిగితా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు రూ.77.62 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 2.63 కోట్ల లీటర్ల మధ్య స్వాధీనం చేసుకున్నాం. అక్రమంగా నిర్వహిస్తున్న 4,038 మద్యం దుకాణాలు మూసివేశాం. సి-విజల్ యాప్‌కు ఇప్పటి వరకు 2251 ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులో 81 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT