అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

కేసీఆర్, కేటీఆర్‌కు ఈసీ నోటీసులు

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు, ఆపద్ధర్మ ప్రభుత్వంలోని మంత్రి కేటీఆర్‌పై ఎన్నికల సంఘం సీరియస్ అయింది.  "తూ నీ బతుకు చెడ" అన్న వ్యాఖ్యలు ఎందుకు చెయ్యవలసి వచ్చిందో? వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ జనరల్ సెక్రటరీకి ప్రధాన ఎన్నికల సంఘం (సిఈవో) నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బుధవారం గజ్వేల్లో నామినేషన్ వేసిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ విపక్షాలపై విమర్శలు గు ప్పిస్తూ తూ నీ బతుకు చెడఅని వ్యాఖ్యానించారు.

అయితే కేసీఆర్ వ్యాఖ్యలను టీటీడీపీ తప్పుబట్టింది. అంతేకాదు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ  కేశవరావుకు ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది. తూ నీ బతుకు చెడఅన్న వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వచ్చిందో 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ అధికారులు ఆదేశించారు. 
ఇక కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఇటీవల సిరిసిల్లలో జరిగిన ఓ సభలో ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు ఇచ్చిన వరాలపై కూడా ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరిసిల్లలో జరిగిన సభలో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఫుల్‌గా ప్రాక్టీస్ చేసుకునేలా ప్రస్తుతం ఉన్న ఆదేశాలను సవరిస్తామని, వారికి సర్కారు పూర్తి సహకా రం అందిస్తుందని, అందువల్ల వారంతా తప్పకుండా టీఆర్‌ఎస్‌కే ఓటు వెయ్యాలని కేటీఆర్ కోరారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది.  

కెసిఆర్ నోటి వెంట వెలువడిన పదాలు

*చంద్రబాబు ఆంద్ర రాక్షసి..
*కెసిఆర్నేను మూడో కన్ను తెరిస్తే..నీ గతేంకాను నీతో పొత్తా ..ఛీఛీ..!
*తెలంగాణ ఆంద్రులకు చంద్రబాబు శని
*చంద్రబాబు పెద్ద కుట్రదారుడు..ఇక్కడ పెత్తనం చేయాలని చూస్తున్నారు
*కూటమి అదికారంలోకి వస్తే మన జుట్టు చంద్రబాబు చేతికి
*చంద్రబాబు డబ్బుతో గెలవాలని చూస్తున్నారు..
*బాబు కుట్రలు..నోట్ల కట్టలు...కాంగ్రెస్ ది బానిస బతకు..బాబు ముందు ఉత్తం చేతులు కట్టుకుని నిలబడ్డాడు..
*ఆంద్ర సొమ్ములు ఇక్కడకు తరలించారు. 
*500 కోట్లతో రాహుల్ తో చంద్రబాబు డీల్ అభ్యంతరకరంగా ఉన్నాయని, ఈ నేతలపై చర్య తీసుకోవాలని తెలంగాణ టిడిపి నేతలు పిర్యాదు చేయడం విశేషం.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT