అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

సర్దార్ విగ్రహం.. అంతరిక్షం నుంచీ స్పష్టంగా!


భూమిపై మరో అద్భుతం.. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపోతున్నారు.

నర్మదా నదీ తీరంలో ఏర్పాటుచేసిన ‘స్టాట్యూ ఆఫ్ యునిటీ’ ప్రపంచంలోనే అతి పొడవైన విగ్రహంగా ఆకట్టుకుంటోంది. రూ.2800 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ విగ్రహం అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నెట్‌వర్క్ ప్లానెట్‌

అనే కమర్షియల్ శాటిలైట్ నెట్‌వర్క్ సంస్థ అంతరిక్షం నుంచి ఈ అద్భుతాన్ని కెమేరాలో బంధించింది.

నవంబరు 15న తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలో అంతరిక్షం నుంచి అత్యంత స్పష్టంగా కనిపించే మానవ నిర్మిత కట్టడాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యునిటీ) కూడా ఒకటిగా

నిలిచిపోనుంది. ఇప్పటి వరకు ఈ ఘనత దుబాయ్ తీరంలోని పామ్ ఐలాండ్స్, గిజాలోని గ్రేట్ పిరమిడ్స్‌కు మాత్రమే ఈ పేరుంది.

అక్టోబరు 31న పటేల్ 143వ జయంతి పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. 182 మీటర్లు (597 అడుగులు) ఎత్తుతో ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా రికార్డులకెక్కి

యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. నవంబరు 12వ తేదీ నాటికి ఈ విగ్రహాన్ని 1.28 లక్షల మంది సందర్శించారు. 

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT