అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

జనగామకు కోదండ రాం..రాం...పొన్నాలకే చాన్స్

మాజి మంత్రి కాంగ్రేస్ పార్టి సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఎట్టకేలకు టికెట్ విషయంలో పార్టి అధిష్టానాన్ని ఓప్పించాడు. మూడో జాబితాలో జనగామ స్థానాన్ని పొన్నాలకు కెటాయిస్తు అధిష్టానం ఉత్కంఠకు తెర దించింది. ఈ స్థానం నుండి కూటమి భాగస్వామి టిజెఎస్ అధ్యక్షులు కోదండరాం పోటి చేసేందుకు ఉత్సాహం చూపాడు. దాంతో పొన్నాల లక్ష్మయ్య కొద్ది రోజులు పరేషాన్ లో పడ్డాడు. డిల్లీకి వెళ్ళి ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీతో కల్సి ఆయన్ను ఒప్పించాడు. రాహల్ గాంది చొరవ తీసుకుని కోదండరాం తో మాట్లాడి పొన్నాలకు లైన్ క్లియర్ చేశాడు. లక్ష్మయ్య సీనియర్ నేత అని ఆయనకు తగిన గౌరవం ఇవ్వాల్సి ఉందని అట్లాగే కోదండ రాం కు కూడ  ప్రాధాన్యత నివ్వాల్సి  ఉందని పార్టి తెలంగాణ ఇన్ చార్జి కుంతియా అన్నారు. కూటమి అధికారిలోకి వస్తే  కొందండరాంకు మంత్రి పదవి ఇస్తామని కుంతియా తెలిపాడు. పొన్నాలకు టికెట్ ఖరారు కావడంతో  జనగామ నియోజకవవర్గంలో  పార్టికార్యకర్తలు ఆయన అనుతరులు సంబరాలు జరిపారు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT