అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

ఈటలపై పోటీ చేస్తా.. ఈటల కారు డ్రైవర్


టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటల రాజేందర్‌పై ఆయన మాజీ కారు డ్రైవర్ మేకల మల్లేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈటల వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ.. ఆయనతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు..
అసెంబ్లీలో జరిగిన ఘటనలో 45 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించానని తెలిపారు. తాను జైలు నుంచి విడుదలయ్యాక దాతలు తనను సన్మానించి ఆర్థిక సాయం కింద రూ.30 లక్షలు ఇచ్చారని.. వాటిని ఈటల తీసుకున్నట్లు ఆరోపించారు.
జైలుకు వెళ్లడంతో ఉద్యోగం పోయిందని... తర్వాత కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తాను మంత్రి ఈటల రాజేందర్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మల్లేశ్ యాదవ్ ప్రకటించారు.

ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజేందర్‌తో పాటు కొందరు తనకు అన్యాయం చేశారని.. తనకు ప్రాణహానీ ఉందని.. రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరాడు. 

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT