అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

జనసేన పోటీలో ఉన్నట్లా లేనట్లా

తెలంగాణ రాష్ర్టంలో జరిగే ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పార్టి జనసేన పోటీలో ఉన్నట్లా లేనట్లా అనేది ఒకటి రెండు రోజుల్లో తేల నుంది. ఒక రకంగా చెప్పాలంటే జనసేన అధినేత పవన్ కు పెద్ద చిక్కే వచ్చి పడింది. తెలంగాణ రాష్ర్టంలో జరిగే ఎన్నికలకు దూరంగా ఉండాలనుకున్నా ఆయన్ను మంత్రి కెటిఆర్ వదలడం లేదట. గ్రేటర్ లో పోటి చేసి తీరాలని పవన్ కు వర్తమానాల మీద వర్తమానాలు పంపుతున్నాడట. పవన్ కళ్యాన్ గ్రేటర్ హైదరాబాద్ లో తన పార్టి అభ్యర్థులను పోటీకి దింపితే సెటిలర్ల వోట్లు చీలి  లాభం కూరుతుందని టిఆర్ ఎస్ ఎదురు చూస్తోంది. తెలంగాణ లో ఎన్నికలకు దూరంగా ఉండాలని ముందు పవన్ నిర్ణయించుకున్నా మంత్రి కెటిఆర్ వర్తమానాలతో పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. ఎన్నికలు షెడ్యూల్డు ప్రకార 2019 లో జరిగితే పోటీకి గ్రేటర్ హైదరాబాద్ లో 23 స్థానాలలో పోటీ
చేయాలని పవన్ కళ్యాన్  భావించారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయం రెండు మూడు రోజుల్లో వెల్లడిస్తానని పవన్ తన అనుచరులకు చెప్పినట్లు సమాచారం.
ఒక వేళ తెలంగాణలో పోటి చేసిన స్థానాలలో ఓడిపోతే 2019 ఆంద్రాలో జరిగే ఎన్నికలలో జనసేన పార్టీపై ప్రభావం చూపుతుందని పవన్ సన్నిహితులు పోటీ వద్దని వారిస్తున్నట్లు మరో వాదన వినిపిస్తోంది.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT