అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మర్రి శశిధర్ రెడ్డి


తప్పుడు సర్వేలు చూపి.. తాను గెలవలేని అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించారు
సనత్ నగర్ ను కావాలనే టీడీపీకి అప్పగించారు
ఎల్లుండి సాయంత్రంలోగా నా విషయంలో పునరాలోచించుకోవాలి

తనకు టికెట్ రాకపోవడంలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల బరి నుంచి తనను తప్పించడానికి తప్పుడు సర్వేలను ఉత్తమ్ చూపిస్తున్నారని

ధ్వజమెత్తారు. తాను గెలవలేనని చెప్పి, తనకు టికెట్ దక్కకుండా అధిష్ఠానాన్ని, స్క్రీనింగ్ కమిటీని ఉత్తమ్ తప్పుదోవ పట్టించారని అన్నారు.

 సనత్ నగర్ టికెట్ తనకు వస్తుందని టీడీపీ ముఖ్యనేతలు కూడా తనతో చెప్పారని అన్నారు. ఎల్బీనగర్ స్థానం కోసం పట్టుబట్టిన తమ పార్టీ నేతలు... సనత్ నగర్ ను కావాలనే టీడీపీకి అప్పగించారని మండిపడ్డారు. ఎల్లుండి సాయంత్రం లోగా

తమ పార్టీ తన విషయంలో పునరాలోచించుకోవాలని హెచ్చరించారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచన తనకు లేదని చెప్పారు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT