అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

మహబూబ్‌నగర్‌: టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు అంబాసిడర్‌ కారు.. నెడితేనే స్టార్ట్‌ అవుతుంది.. ఎన్నికల తర్వాత అది మ్యూజియానికి, కేసీఆర్‌ ఫాంహౌ్‌సకు ఖాయంఅని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్‌.. బ్లఫ్‌మాస్ట ర్లు అని, ఎప్పుడూ అబద్ధాలు చెబుతుంటారని ధ్వజమెత్తారు. వీరికి మజ్లిస్‌ తోడైందని, అటు బీజేపీకి.. ఇటు టీఆర్‌ఎ్‌సకు ఆక్సిజన్‌ అందిస్తోందని ఆరోపించారు. సోనియా వల్లే తెలంగాణ ఏర్పాటైందని స్పష్టం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ విజయానికి తెలంగాణ ఫలితాలే బాటలు వేస్తాయన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 14 స్థానాల్లో మహాకూటమి విజయం సాధిస్తుందన్నారు

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT