అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

నేనే బాద్ షా.... సైబరాబాద్‌షా

కొన్నేళ్ల పాటు రాత్రీపగలు కష్టపడితే సైబరాబాద్‌ ఈ రూపానికి వచ్చింది 

రోడ్‌షోలో తెదేపా అధినేత చంద్రబాబు 

హైదరాబాద్‌ను, చార్మినార్‌ను నేనే నిర్మించానని ఎప్పుడూ చెప్పలేదు. వాటిని కులీకుతుబ్‌షా కట్టారు. ఇది చరిత్ర. దీన్ని ఎవరూ మార్చలేరు. తెలంగాణకు ఆర్థిక వనరులను సమకూర్చే బ్రహ్మాండమైన సైబరాబాద్‌ను నేను అభివృద్ధి చేశా. ఎవరు ఏమన్నా ఇది నిజం. ఐటీ రంగం అభివృద్ధి కారణంగా ఈ ప్రాంతంలో భూముల విలువలు బాగా పెరిగాయి. ఒకప్పుడు ఎకరా రూ.లక్ష ఉంటే ఈ రోజు రూ.30 కోట్లు పలుకుతోంది!  ఆ రోజు నేను తీసుకున్న చొరవతో సైబరాబాద్‌లో ఈ రోజు 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.  కొన్ని ఏళ్లపాటు రాత్రీ పగలు కష్టపడితే ఈ స్థాయి అభివృద్ధి సాధ్యమైంది. అమెరికాకు వెళ్లి 16 రోజులు కాలినడకన కంపెనీలను కలిసి హైదరాబాద్‌కు తీసుకొచ్చాం.

సైబరాబాద్‌ నా మానస పుత్రిక నా చొరవ వల్లే 10లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయి ...ఎకరా రూ.లక్ష ఉండే భూమి విలువ రూ.30 కోట్లకు చేరుకుంది ...తెలంగాణ ఆర్థిక వనరులకు ఈ నగరం ప్రధాన కేంద్రం కాదా? ..2009లో నా కృషిని కేసీఆర్‌ మెచ్చుకోలేదా? ..ఇప్పుడెందుకిలా దూషిస్తున్నారు? No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT