అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

కెసీఆర్‌కు జైలు జీవితం దగ్గరలోనే ఉంది: పొన్నాల లక్ష్మయ్య

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జైలు జీవితం దగ్గరలోనే ఉందని, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని, వెనువెంటనే కేసీఆర్‌ను చర్లపల్లి జైలుకు పంపిస్తుందని హెచ్చరించారు. గురువారం భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్‌ అరాచకాలకు ఎదురులేకుండా పోయిందన్నారు. 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకేదో మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తే అధికారంలోకి వచ్చింది మొదలు కేసీఆర్‌ దోపిడీకే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో తన కుటుంబ సంపద పెరగడానికి దోహదపడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ పాలన అంటే పారదర్శకంగా ఉండాలని, కేసీఆర్‌ ప్రభుత్వంలో కొరవడింది అదే అనీ అన్నారు. కేసీఆర్‌ అవినీతి పాలనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే దృష్టిసారిస్తుందని చెప్పారు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT