అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

సంక్షేమ రాజ్యం మాదే....పరిణతితో ఆలోచించండి

ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ 

ల్యాణలక్ష్మి, అమ్మఒడి వంటి పథకాలను  అందిస్తున్నాం. శుద్ధ జలం అందించేందుకు మిషన్‌ భగీరథ పనులు 90 శాతం పూర్తయ్యాయి. త్వరలోనే మిగిలిన పనులు పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తాం. అంధత్వం లేని తెలంగాణ కోసం కంటి వెలుగుకొనసాగిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యం సాధించడానికి ప్రతి వ్యక్తికీ త్వరలో దంత, చెవి, ముక్కు, గొంతు పరీక్షలు  చేస్తాం. ప్రస్తుతం మీ కళ్ల ముందు కనిపిస్తున్న పథకాలు మా పాలనకు నిదర్శనం. మన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహారాష్ట్రలోని 48 గ్రామాల ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలపాలని ఆందోళన చేస్తున్నారంటే ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. 


తెలంగాణ విభజన తర్వాత ముస్లిం, గిరిజన జనాభా శాతం పెరిగింది. వీరికి అనుగుణంగా రిజర్వేషన్లు పెరగాలి. కానీ 50 శాతం మించకూడదని సుప్రీం తీర్పు ఇచ్చింది. దీనిని సవరించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. ముస్లిం మైనార్టీ, గిరిజన రిజర్వేషన్లపై తీర్మానం చేసి దిల్లీకి పంపితే భాజపా నోరు మెదపలేదు. ఇప్పుడేమో రిజర్వేషన్లు ఇవ్వబోమని చెబుతున్నారు. కేంద్రం మెడలు వంచి ముస్లిం రిజర్వేషన్లు తెస్తాం.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT