అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

కేసీఆర్ వస్తే ఏంటి...రానివ్వండి సంతోషం...చంద్రబాబు నాయుడు

అందరినీ గందరగోళం చేసేందుకే కేసీఆర్‌ రాష్ట్రాల పర్యటనలకు వెళ్తున్నారు...కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే సంతోషమే...రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు వస్తాయి...అని ఆంద్రప్రదేశ్ రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబ ు నాయుడు అన్నారు.టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ల నున్నారనే వార్తపై చంద్రబాబు  స్పందించారు.
శుక్రవారం అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ కామెంట్స్‌తో పాటూ, తాజా రాజకీయాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్‌పై చంద్రబాబు స్పందించారు. అందరినీ గందరగోళం చేసేందుకే కేసీఆర్‌ రాష్ట్రాల పర్యటనలకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. 

రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు వస్తాయంటున్నారు చంద్రబాబు. అందుకు టీడీపీ నేతలు కూడా మానసికంగా సిద్ధపడాలని సూచించారు. మోదీ ఏపీ పర్యటనపై టీడీపీ అధినేత స్పందించారు. రాష్ట్రానికి ఏమీ చేయని మోదీ.. జనవరి 6న పర్యటనకు ఎలా వస్తారన్నారు. అందరూ కలిసి ఆడుతున్న డ్రామాలను ప్రజాక్షేత్రంలో ఎండకట్టాలని టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. 

ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం రావడంలేదని అభిప్రాయపడ్డారు టీడీపీ అధినేత. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో ఎక్కువ ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. మన ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవడం మన ప్రాథమిక హక్కని.. ఈవీఎంల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. వీవీప్యాట్‌లలో గుర్తు సరిగ్గా పడటంలేదని బాబు విమర్శించారు. 

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT