అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ భేటీ

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో బాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్ రావు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జినికలిసారు. ఇద్దరితో వేరువేరుగా చర్యలు జరిపారు.
ఒడిషా పర్యటన ఉన్న కెసిఆర్ ఆదివారం రాత్రి  నవీన్ పట్నాయక్‌తో సమావేశ మయ్యారు. సోమవారం ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా పూరీ జగన్నాథ్ దేవాలయానికి చేరుకుని పూజలు జరిపారు.
స్వామికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం  ప్రఖ్యాత కోణార్క్ సూర్యదేవాలయాన్ని కూడా ముఖ్యమంత్రి సందర్శించారు. తర్వాతకోల్ కతా వెళ్లిన కెసిఆర్ సిఎం మమతా బెనర్జీని కల్సి  చర్చలు జరిపారు. మమతా బెనర్జీతో చర్చల అనంతరం కాళిమాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT