అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

టీఆర్ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ విలీనం

ఎన్నికల్లో ఇప్పటికే ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.కాంగ్రెస్ ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, ప్రభాకర్ ఆ పార్టీకి ఝలక్ ఇచ్చి టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌కుమార్ నిన్న సీఎం కేసీఆర్‌ను కలిశారు.శుక్రవారం వీరంతా మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను కలిశారు.
ఆకుల లలిత, టి. సంతోష్‌ కుమార్‌ బాటలోనే మరికొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ తొలి సమావేశానికి ముందే పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వస్తారని పేర్కొంటున్నాయి. 

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT