అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

తాగేసారు...చిందేసారు...కొత్త ఏడాది స్వాగతానికి 31న రూ.133 కోట్ల మద్యం తాగేశారు!

డిసెంబరు 31న ఏకంగా రూ. 133 కోట్ల మద్యాన్ని తాగేసారు. రాష్ట్రంలో రోజుకు రూ. 50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. అయితే, సోమవారం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా రూ. 133 కోట్ల విక్రయాలు జరిగాయి. అంతేకాదు, డిసెంబరు చివరి వారంలో రూ.600 కోట్లకుపైగా విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 19.5 కోట్ల మద్యం అమ్ముడుపోగా, రంగారెడ్డిలో రూ.15.30 కోట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ. 18 కోట్లు, మేడ్చల్ జిల్లాలో రూ.11.90 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మొత్తంగా రూ. 20 వేల కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా ఒక్క డిసెంబరులోనే ఏకంగా రూ. 1,962 కోట్ల మద్యం అమ్ముడుపోయింది.

ఆంధ్రాలో కూడ

ఆంధ్రా లోను అంతే.. మూడు రోజుల్లో రూ.289 కోట్ల విలువైన మద్యాన్ని తాగేసారు....

ఏపీలోనూ ఇంచుమించు అదే స్థాయిలో విక్రయాలు జరిగాయి. 31న వంద కోట్ల రూపాయలకు పైగా విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ చెబుతోంది. రాష్ట్రంలో సగటున రోజుకు రూ. 50 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా, డిసెంబరు 29 నుంచి 31 వరకు మొత్తం రూ. 289 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబరు 29న రూ. 103 కోట్లు, 30న రూ. 67 కోట్లు, 31న రూ. 118 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
మూడు రోజుల్లో బీర్ల అమ్మకాలు కూడా లిక్కర్‌తో పోటీపడ్డాయి. డిసెంబరు 29 నుంచి 31 వరకు మొత్తం 4,87,888 కేసుల లిక్కర్‌ అమ్ముడుపోగా, 3,62,147 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. వీటితోపాటు ఖరీదైన మద్యం కూడా పెద్ద మొత్తంలో అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT