అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

మార్చి 31 వరకు కాళేశ్వరం పూర్తి చేయాలి..సిఎం కెసిఆర్

మార్చి 31వ తేదీ వరకు ప్రధానమైన ప్రాజెక్టు పనులన్నీ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు.గోదావరిలో కాఫర్‌డ్యామ్ ఏర్పాటుచేసుకొని ఏప్రిల్ నెలలో ప్రాజెక్టు ట్రయల్న్ నిర్వహించాలని చెప్పారు. ఈ వర్షాకాలంలో జూన్ నుంచి గోదావరి నీటిని కరీంనగర్‌లోని మిడ్‌మానేరు వరకు ఎత్తిపోసేలా ప్రణాళిక రూపొందించుకొని అమలుచేయాలని సూచించారు.
ప్రాజెక్టుల బాటలోబాగంగాకెసిఆర్ మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టుత ోపాటు ఇతర ప్రాజక్టులు సందర్శించారు.
గోదావరినదిలో తెలంగాణ వాటా నీళ్లను వీలైనంత త్వరగా ఉపయోగించుకోవాలంటే ఈ ప్రాజెక్టులో పంపుహౌస్‌ల నిర్మాణం, మోటర్ల బిగింపు పనుల ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. గోదావరికి రెండువైపుల ఉండే ఫ్లడ్ బ్యాంక్స్ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ మట్టిపని, రివిట్‌మెంట్ పనులను జలాశయం మట్టం దాకా పూర్తిచేయాలని సూచించారు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT