అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

కాంగ్రెస్ ఎమ్మెల్యే, పోలీసుల మధ్య వాగ్వాదం

జయశంకర్ భూపాలపల్లి:ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం పర్యటన నేపథ్యంలో అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు, డ్యూటీలో ఉన్న పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. వ్యూ పాయింట్‌ వద్దకు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మహదేవపూర్‌ జడ్పీటీసీ, ఎంపీటీసీలతో వచ్చారు. ఈ క్రమంలో వ్యూపాయింట్‌ లోపలికి ఎమ్మెల్యేతో వచ్చిన వారిని పోలీసులు నిరాకరించడంతో ఎమ్మెల్యే కలుగజేసుకుని స్థానిక ప్రజాప్రతినిధులను ఎలా రానివ్వరంటూ ప్రశ్నించారు. దీంతో డ్యూటీలో ఉన్న పోలీసులు తమ డ్యూటీ తాము చేసుకుంటున్నాం.... తమ విధులకు ఆటంకం కలిగించవద్దని గట్టిగానే చెప్పడంతో వివాదం తలెత్తింది. కాగా... ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు, పోలీసులకు మధ్య జరుగుతున్న వాగ్వాదాన్ని ఉన్నతాధికారులు గమనించి అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేను పముదాయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధులను పోలీసులు చులకనగా చూడడాన్ని తప్పుబట్టారు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT