అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

వై.ఎస్ జగన్....కెటిఆర్ ఆ ఇద్దరు అందుకే కలిసారు

ఎన్నికలు సమీపించే కొద్ది రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. బిజెపి కి వ్యతిరేకంగా కాంగ్రేస్ పార్టి సారద్యంలో ఓ వైపు మహాకూటమి ఏర్పాటుకాగా మరో వైపు బిజెపి కాంగ్రేస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రసేఖర్ రావు సాదర్యంలో ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఎపి విపక్ష నేత వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ర్ట  సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఇద్దరు కలిసారు. కుశల ప్రశ్నల అనంతరం హైదరాబాద్ లోని జగన్ నివాసంలో ఇద్దరూ చాలా సేపు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  

రాష్ట్రాల హక్కులు కాపాడాలంటే ఎక్కువసంఖ్యలో ఎంపీలు గళమెత్తాల్సిన అవసరముందని, ఈ క్రమంలో ఏపీకి చెందిన 25మంది ఎంపీలకు తోడుగా తెలంగాణ ఎంపీలు 17మంది కలిసివస్తే కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే అవకాశముంటుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎక్కువ ఎంపీల మద్దతు అవసరమందని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపీలు కలిసివస్తే.. ఏపీకి మరింత మేలు జరుగుతుందని ఆయన అన్నారు.

కెటిఆర్ ఏమన్నారంటే.....
...దేశం లో రాజకీయ ప్రత్యామ్నాయం ఉండాలనే లక్ష్యం తో కెసిఆర్ దేశం లో చాలా మంది నేతల తో మాట్లాడుతున్నారు.
...అందులో భాగం గానే నిన్న కెసిఆర్ జగన్ తో ఫోన్ లో మాట్లాడారు
...ఈ రోజు ఇంటికి రమ్మని జగన్ ఆహ్వానించడం తో వచ్చాము
...జగన్ ,ఇతర వైసీపీ నేతలతో ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరిగాయి
...త్వరలో మా అధినేత ,సీఎం కెసిఆర్ విజయ వాడ వెళ్లి జగన్ తో మరింత లోతుగా చర్చిస్తారు
...ఈ రోజు జరిగింది మొదటి సమావేశం మాత్రమే
...ప్రత్యేక హోదా పై సీఎం కెసిఆర్ ఇప్పటికే trs వైఖరి చెప్పారు
...ఈ రోజే అన్ని చెప్పేస్తే మీడియా కు రాసుకోవడానికి ఏం మిగలదు

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT