అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

సర్పంచ్ పదవి కోసం అమెరికా నుండి వచ్చిన ఎన్ఆర్ ఐ

డాలర్లపై మోజుతో అమెరికా వెళ్లి నాలుగు డాలర్లు వెనకేసుకుంటారు. అట్లా వెళ్లిన శ్వేత అనే ఓ వివాహిత అక్కడి డాలర్ల సంపాదన వదులుకుని స్వంత ఊరి సర్పంచ్ పదవి కోసం ఉద్యోగాన్ని  వదిలి పెట్టేసి ఇండియాకు వచ్చింది. గ్రామంలో సర్పంచ్ గా ఎ్ననికల బరిలో నిలిచింది.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం లోని కాసాల గ్రామ సర్పంచ్ పదవిని ఓసీ మహిళకు కేటాయించారు.దాంతో సర్పంచ్ గా పోటి చేసేందుకు శ్వేత  అమెరికా నుండి తిరిగి వచ్చారు. ఆమె భర్త భర్త గౌరెడ్డిగారి అనిల్‌రెడ్డి ఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. శ్వేత ప్రీ- స్కూల్‌ సంచాలకురాలు. పన్నెండేళ్లుగా అమెరికాలోని మేరీలాండ్‌లో నివాసం ఉంటున్నారు. కాసాలలో మొత్తం ఐదుగురు పోటీచేస్తున్నారు.బరిలో ఉన్న శ్వేత తాను సర్పంచ్‌ను అయితే గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసేది వివరిస్తూ 12 అంశాలతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు.వార్డుసభ్యులతో అభివృద్ధి కమిటీల ఏర్పాటుచేస్తానని, డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని  అంగన్‌వాడీలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతానంటూ శ్వేత గ్రామస్తులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT