అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

తెలంగాణ స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి

తెలంగాణ అసెంబ్లీకి కొత్త స్పీకర్ గా ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి రం శుక్రవారం పదవి భాద్యతలు చేపట్టారు. పోచారంను అన్ని పార్టీల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ప్రోటెం స్పీకర్‌ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ఆయన్ను స్పీకర్‌గా ప్రకటించారు. స్పీకర్ పోచారంకు సీఎం కేసీఆర్, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తదితరులు వెంట రాగా పోచారం శ్రీనివాస్‌ స్పీకర్‌ కుర్చీలో ఆశీనులయ్యారు.
శ్రీనివాస్ రెడ్డి తనకు పెద్దన్న వంటివాడని, ఆయనకు తాను లక్ష్మీ పుత్రుడని ముద్దుగా పేరు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపిన సందర్భంగా అన్నారు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT