అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

రాష్ర్టం ఏర్పడి ఐదేళ్లు అయినా తెలంగాణ లో ఇంకా ఆంధ్ర వార్తలా...కెటిఆర్

తెలంగాణ రాష్ర్టం ఏర్పడి ఐదేళ్లు గడిచినా  ఇక్కడి ఎడిషన్లలో ఇంకా ఆంధ్ర వార్తలు ప్రచురిస్తూ ఆంధ్ర మీడియా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోందని తెలంగాణ రాష్ర్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు.
ఇక్కడి పత్రికల్లో ఆంధ్ర వార్తలు ప్రచురిస్తే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ.. ఆంధ్ర ఎడిషన్‌లోనూ తెలంగాణ వార్తలు ప్రచురించాలి కదా? ఢిల్లీకి పోయి తెలుగు పత్రికలు చూస్తే తెలంగాణ వార్తలే ఉండవు. ఆంధ్రా ఎడిషన్‌లో తెలంగాణ వార్తలు రాయనప్పుడు.. తెలంగాణలో ఆంధ్రా వార్తలెందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు వంతపాడుతున్న పత్రికల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడితే కొంతమందికి కోపం వస్తున్నదని అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని అణువణువునా నింపుకొని పనిచేస్తున్న పత్రికలను ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గతంలో సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ఆధిపత్య ధోరణిని అవలంబిస్తూ తెలంగాణవాదాన్ని తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నాయని, ఈ డ్రామాలు ఇంకా నడువబోవని హెచ్చరించారు. తెలంగాణ భావజాల పత్రికలకు పెద్దపీట వేయాల్సిన బాధ్యత తమపై ఉన్నదన్న కేటీఆర్.. దీనికి తెలంగాణ జర్నలిస్టుల సహకారం కూడా అవసరమన్నారు. ఆధిపత్య ధోరణిపై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. మీడియా హక్కులను హరిస్తున్నారు.. మీడియా గొంతు నొక్కేస్తున్నారు.. మొత్తం మీడియా మీద దాడి.. అంటూ చిత్రీకరిస్తారని చెప్తూ.. అలాంటి అరాచకపు ప్రయత్నానికి మన జర్నలిస్టులు లొంగిపోవద్దని కోరారు.
వాళ్లు ఏం చెప్తే అదే కరెక్ట్.. అదే వేదం అన్నట్టు ప్రవర్తిస్తున్నారని, ఆ ఆధిపత్య ధోరణికి ముగింపు పలుకాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి,ఎమ్మెల్యే రామలింగారెడ్డి,టియూడబ్ల్యుజె నాయకులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT