అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

పవన్ స్టార్ పవర్ సార్ ఏం మాట్లాడు కున్నారు?

రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఎట్ హోం లో కల్సుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తెలంగాణ ముఖ్యమంత్రి పవర్ సార్ ఏం మాట్లాడుకున్నారు. ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని ముచ్చటించిన దృష్యాలు చూసిన వారిలో తెల్సుకోవాలన్న ఆసక్తి. కెసిఆర్ తో పాటు కెటిఆర్ కూడ ముచ్చటించారు. ఇటీవల వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కెసిఆర్ తనయుడు కెటిఆర్ ఇద్దరూ కల్సుకున్న సందర్భంగా పవన్ కళ్యాన్ రాజకీయ విమర్శలు చేశాడు.
తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీతో సహా కెసిఆర్, కెటిఆర్ లను విమర్శించిన పవన్ కళ్యాన్ తో ఇంతకూ ఏం మాట్లాడారంటే తప్పని సరిగా రాజకీయాలే మాట్లాడారు.
ఏపీ రాజకీయాలు, ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి కేసీఆర్‌ ముచ్చట్లో  ప్రస్తావించినట్లు సమాచారం. అట్లాగే ఫెడరల్  ఫ్రంట్‌ ఉద్దేశాన్ని వివరించారట.  ఏపీలో రాజకీయ పార్టీల బలాబలాలపై తన వద్ద ఉన్న సమాచారాన్ని పవన్‌తో పంచుకున్నారని సమాచారం. తాజాగా వచ్చిన సర్వేల ఫలితాలు కూడ కెసిఆర్ పవన్ కళ్యాన్ తో మాటల సందర్భంగా ప్రస్తావించి ఇక వచ్చే ఎన్నికల్లో  బాబుకు కష్టకాలమే అని పరోక్షంగా చెప్పినట్లు తెల్సింది. ఎపిలో వై.ఎస్ జగన్ కు మంచి అవకాశాలు ఉన్నాయని కెసిఆర్ విశ్లేషణ. ఆ విషయం పన్ కళ్యాన్ కు వివరించడమే కాక ఫెడరల్ ఫ్రంట్ లో  చేరితే మంచిదని సలహా ఇచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో కేటీఆర్‌, కేసీఆర్‌‌లతో పవన్‌ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT