అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

ఫలితాలపై నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి...లగడ పాటి

తెలంగాణ ఎన్నికలఫలితాలపై తనకు కొన్పైని అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు.వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కిస్తే ఓటర్ల అనుమానాలు నివృత్తి అవుతాయని అన్నారు.తమ ప్రీ పోల్ సర్వేలో వచ్చిన ఫలితాలు ఎందుకు కనిపించలేదో తాను 2019 లోకసభ ఎన్నికల తర్వాత పోల్చుకొని ప్రశ్నిస్తానని తెలిపారు. ఎన్నికల సంఘం అనుసరించిన విధానాలపై అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. 
సాయంత్రం 5 గంటల తర్వాత ఎక్కువ పోలింగ్ నమోదయినట్లు చెబుతున్నారనీ, అలాంటప్పుడు గంటగంటకు ఎంత పోలింగ్ నమోదయిందో చెప్పాలన్నారు. ఎలక్ట్రానిక్ యుగంలో గంటలో చెప్పాల్సిన పోలింగ్ శాతానికి.. రెండు రోజుల సమయం ఎందుకు తీసుకున్నారన్నారు. సాయంత్రం ఐదు తర్వాత పోలింగ్ శాంత ఎంత మేర పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా జరిగిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విపక్షం పుంజుకుందన్నారు. నెలరోజుల వ్యవధిలో జరిగిన ఎన్నికల్లో ఇంత తేడానా అన్నారు. తానేమీ అనవసర ఆరోపణలు చేయడంలేదని.. తానెవరి కోసమో పని చేయడం లేదన్నారు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT