అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

టీఆర్‌ఎస్‌లో విలీనమైన వంటేరు ప్రతాపరెడ్డి

అసెంబ్లి ఎన్నికల్లో కెసిఆర్ పై తలపడిన కాంగ్రేస్ పార్టి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి టిఆర్ఎస్ లో విలీన మయ్యాడు. ఓ ప్రత్యర్థి ఓటమి అనంతరం తన ప్రత్యర్థి పార్టీలోనే చేరి పోవడం రాజకీయాల్లో ఓ సంచలనంగా మారింది.
 టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమక్షంలో తెలంగాణ భవన్‌లో శుక్రవారం (జనవరి 18) సాయంత్రం 5.20 గంటలకు వంటేరు ప్రతాపరెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. వంటేరుతో పాటు గజ్వేల్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్ భవన్‌కు భారి సంఖ్యలో చేరుకున్నారు. వంటేరు ప్రతాపరెడ్డికి టీఆర్‌ఎస్ కండువా కప్పిన కేటీఆర్ ఆయణ్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల ఆహ్వానం మేరకు పార్టీలో చేరుతున్నానని తెలిపారు. గతంలోనే టీఆర్‌ఎస్‌లో చేరి ఉంటే ఎంతో బాగుండేదని అన్నారు.పార్టీలోకి రావాలని గతంలోనే మూడు సార్లు కేటీఆర్‌ కోరారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో కేసీఆర్‌కు రైతులు అండగా నిలిచారన్నారు. ఎన్నికల్లో గెలవాలనే పోరాటం చేశా.. కేసీఆర్‌పై వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. గజ్వేల్‌ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT