అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

రూ.36,000 ఖర్చుతో వివాహం...ఓఐఏఎస్ అధికారి నిర్ణయం

ఈ అధికారిని అభినందించాల్సిందే

వివాహాలను ఆడంబరంగా జరిపేందుకు పోటీలు పడి ఎవరి స్తోమతలకు తగ్గట్టుగా వారు ఖర్చు చేస్తుంటారు. లక్షలు, కోట్లు ఖర్చు చేసే వారున్నారు. ఇలాంటి సాంప్రదాయానికి స్వస్థి పలకాలని ఓ ఐఏఎస్ అధికారి నిర్ణయించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టం లోని  విశాఖ నగర మెట్రో ప్రాంతీయ అభివృద్ధి మండలి (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌ పట్నాల బసంత్‌కుమార్‌ తన కుమారుడి వివాహం కేవలం రూ.36,000 బడ్టెట్ తో చేయాలని సంకల్పించాడు. సత్సంగ్ అధ్వర్యంలో ఫిబ్రవరి 10 వ తేదీన జరగబోయే పెండ్లి తంతుకు రాష్ర్ట గవర్నర్ నర్సింహన్ దంపతులు పలువురు వివిఐపిలు కూడ హాజరుకానున్నారు. గతంలో తన కుమార్తె వివాహం కేవలం రూ. 16100 ఖర్చుతో జరిపించాడు. భారీగా వెచ్చించి వివాహాలను ఆడంబరంగా జరిపించడం వల్ల ఆర్థికంగా లేని కుటుంబాలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందుకే ఈ అధికారి అందరికి ఆదర్శంగా ఉండేవిదంగా పెండ్లిళ్లు ఇట్లా చేయవచ్చని సందేశం పంపేందుకు నిరాడంబరతను ఎంచుకున్నారు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT