టీఆర్‌ఎ్‌సకు 16 ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతామంటున్నారని, ఆ సీట్లతో ఢిల్లీలో బొంగ రం కూడా తిప్పలేరనిమల్కాజిగిరి లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డివిమర్శించారు.
ఇక్కడ కారుకు ఓటేస్తే.. ఆ ఓటు ఢిల్లీ వెళ్లేసరికి కమలంలా మారిపోతుందని, ఎంపీ సీట్లను అమ్ముకునేందుకు టీఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ పాలనకు చమరగీతం పాడాలంటే ప్రతిఒక్కరూ కాంగ్రె్‌సకు అండగా నిలబడాలని కోరారు. కురుక్షేత్రం లాంటి ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని కూకట్పల్లి, కుత్బుల్లాపూర్‌లలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చూడ డం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, పాలనలో తలెత్తే తప్పులపై పోరాడగలిగే వ్యక్తులను ఎన్నుకోవాలన్నారు. ప్రతిపక్షం ఉంటే అభివృద్ధి జరగదని, అందరూ ప్రభుత్వంలోనే ఉండాలని సీఎం కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నా రు. కేసీఆర్‌కు దేవుడు నెత్తిమీద కూర్చున్నందున కొన్నా ళ్లు ఆయన హవా సాగుతుందని, తాగినోడిది.. సాగినోడిది కొంతకాలం మాత్రమే నడుస్తుందన్నారు. కేసీఆర్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంలా మారారని విమర్శించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను పశువుల పాకలో గొడ్లలా చూస్తూ పక్క పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎ్‌సలో చేర్చుకుంటున్నారని విమర్శించారు.

No comments:
Post a Comment
THANK YOU FOR YOUR COMMENT