అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

16 ఒక్కట్ల 16

తెలంగాణ రాష్ర్టంలో అధికార టిఆర్ఎస్ పార్టి నేతలు అంతా ఇప్పుడు  16 ఎక్కం పటిస్తున్నారు. 16 ఒక్కట్లు 16 అవుతుందా 16 రెండ్లు ఎంత అవుతుంది. మూడు ఎంత అవుతుంది అనేది గుణిస్తున్నారు.
మే 23 వ తేదీ వరకు ఈ 16 ఎక్కం పఠనం కొనసాగుతుంది. అదే రోజు ఈ ఎక్కం లెక్కఏమిటో తేలనుంది. రాష్ర్టంలో 16 కు 16 ఎంపీస్థానాలు గెలిచి కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అనే అతుకుల బొంత ఏర్పడబోతుందని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్  లెక్కలు వేస్తున్నారు. ఆయన ఆలోచనల  దారిలోనే అనుచరవర్గం నడుస్తోంది. 16 సంఖ్య ముంచుతుందో తేల్చుతుందో తెలియదు. అతుకుల బొంతతో కూడిన కూటమి గనుక అధికారంలోకి రాకుండా సంపూర్ణ మెజార్టీతో అటు బిజెపి కూటమిలేదా కాంగ్రేస్ కూటమి అధికారలోకి వస్తే 16 ఎక్కం లెక్క తప్పవచ్చు.  ఎన్నికల ఫలితాలను బట్టి 16 ఎక్కం భవితవ్యం తేల నుంది.అన్ని అనుకున్నట్లు జరిగితే కేంద్రంలో 16 అవసరం ఏర్పడిదే కెసిఆర్ లెక్క కరెక్ట్ అయి ఆడిందే ఆట పాడిందే పాటగా కూడ జరగవచ్చు. 

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT